నేను-నా ఫీలింగ్స్....!!
నా మనసు మౌనంగా రోదిస్తుంది, నా గుండె తన గొంతుకను చీల్చుకుని గట్టిగా తన మనో వేదనను తెలపాలని తాపత్రాయపడుతుంది నా మనసులో మౌనంగా నిర్మించుకున్న మరో లోకమే ఈ నా ఫీలింగ్స్. మనసులో జరిగే చర్య ప్రతిచర్యల ద్వారా, ప్రకృతిలో జరిగే పరిణామాల ఆధారంగా చేసుకొని నాకు నచ్చిన(తోచిన) విధంగా రాస్తున్నాను.... నచ్చితే స్వాగతిస్తారని ఆశిస్తూ.... మీ నేను
Sunday, May 12, 2013
Monday, May 6, 2013
ప్రియా ప్రేమంటే ఇదేనేమో...!!!
నిన్ను తొలిసారి చూసినప్పుడు,
తొలి సారి నీతో మాట్లాడినప్పుడు,
అప్పటి నుంచి,
ఇప్పటిదాకా
నీకోసం ఎదురు చూస్తున్నప్పుడు,
నిన్ను కలిసినప్పుడు,
నీతో మాట్లాడినప్పుడు,
ప్రతి సారి అదే అలజడి అదే ఆర్ధత...!!!
కళ్ళు అలా చూస్తూ ఉండిపోతున్నాయి
మనసేమో మూగబోతుంది
ఒక్కోసారి ఏమి మాట్లాడాలనిపించదు
నిన్ను అలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది
ఎంత సేపైనా
నువ్వు నా నుండి దూరంగా వెళ్ళిపోయిన మరుక్షణమే
మల్లి నిన్ను చూడాలనిపిస్తుంది
ప్రియా ప్రేమంటే ఇదేనేమో
వీడలేక వీడిపోవటం... !!!
Labels:
ప్రేమ...
Location:
Hyderabad, Andhra Pradesh, India
Friday, April 19, 2013
శ్రీరామ నవమి శుభాకాంక్షలు
మనిషి జీవితంలో తను ఒకే సారి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు
కాని ఈ పెళ్లిని మాత్రం ప్రాతి సారి జరిపించాలనుకుంటారు
ఈ పెళ్లి మాత్రం ఎప్పటికి ప్రత్యేకమే,
ప్రతి సంవత్సరం నిత్య నూతనమే,
మనందరికీ ఒక మదుర జ్ఞాపకమే...
ప్రతి సంవత్సరం మనమే దగ్గరుండి మరీ ఈ పెళ్లిని జరిపిస్తాము
మనింట్లో పెళ్ళిగా మురిసిపోతాము
ఈ పెళ్లి జరిగాకే మనింట్లో పెళ్ళిళ్ళ గురించి,
పెళ్లి సంబంధాల గురించి అన్వేషణ మొదలెడతాము
పచ్చని తోరణాలతో,
మేళ వాయిద్యాల నడుమ ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరిగే ఈ సీతారాములోరి పెళ్ళి ఘనంగా ఇలాగే జరగాలని, జరపాలని కోరుకుంటూ మిత్రులందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు
Labels:
ప్రత్యేకం
Location:
Hyderabad, Andhra Pradesh, India
Wednesday, April 10, 2013
Subscribe to:
Posts (Atom)



.jpg)